భద్రాద్రి రామాలయం చుట్టూ వరద నీరు
భద్రాద్రి రామాలయం చుట్టూ వరద నీరు చేరింది. భారీ వర్షాలు కురవడంతో భద్రాద్రి రామాలయం ప్రాంగణంలోకి నీరు చేరింది.
భద్రాద్రి రామాలయం చుట్టూ వరద నీరు చేరింది. భారీ వర్షాలు కురవడంతో భద్రాద్రి రామాలయం ప్రాంగణంలోకి నీరు చేరింది. నిన్న కురిసిన భారీ వర్షానికి భద్రాద్రి ఆలయం వరకూ వరద నీరు చేరడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. అయితే గోదావరి నదిలోకి వెళ్లే న్లూయిస్ లు ఓపెన్ కాకపోవడం వల్లనే ఆలయం వద్ద నీరు నిలిచిందని అధికారులు తెలిపారు.
అదే కారణం...
రామాలయం వద్ద, అన్నదానం సత్రం వద్ద నీరు చేరడంతో ప్రజలు కూడా ఇబ్బందులు పడ్డారు. సాధారణ వర్షానికే నీళ్లు అన్నదాన సత్రంలోకి చేరడంతో భద్రాద్రి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వేసవి కాలంలో స్లూయిస్ ను మరమ్మతులు చేయకపోవడం వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇక భారీ వర్షం నమోదయితే తమ పరిస్థితి ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.