తప్పుడు వార్తలతో ప్రజాస్వామ్యానికి ముప్పు
తప్పుడు వార్తలు ప్రజాస్వామ్యానికి ముప్పు ఏర్పడుతుందని యూఎస్ కాన్సులేట్ జనరల్ అసిస్టెంట్ పబ్లిక్ అఫైర్స్ అధికారి ఫ్రంకీ స్టర్మ్ తెలిపారు
తప్పుడు వార్తలు ప్రజాస్వామ్యానికి ముప్పు ఏర్పడుతుందని యూఎస్ కాన్సులేట్ జనరల్ అసిస్టెంట్ పబ్లిక్ అఫైర్స్ అధికారి ఫ్రంకీ స్టర్మ్ తెలిపారు. తప్పుడు సమచారాన్ని కట్టడి చేసేందుకు అనువైన మార్గాలను అన్వేషించాలని ఆయన కోరారు. వాస్తవాలను మాత్రమే ప్రజలకు తెలియజేసేలా జర్నలిస్టులు నైపుణ్యాన్ని మెరుగుపర్చుకోవాలని ఆయన సూచించారు. ఉస్మానియా యూనివర్సిటీతో కలసి హైదరాబాద్ లోని యూఎస్ కాన్సులేట్ జనరల్ ఓయూ సీఎఫ్ఆర్డీతో కలసి ఏర్పాటు ేసిన రెండు రోజుల వర్క్ షాప్ ను ఆయన ప్రసంగించారు. తప్పుడు సమాచారంపై విస్తృతంగా చర్చ జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. దీనిపై ఉస్మానియా యూనివర్సిటీ వంద గంటల శిక్షణ తరగతులు పూర్తి చేయడాన్ని ఆయన అభినందించారు.
వ్యక్తుల ప్రతిష్టను....
నిరాధార, అసత్య వార్తలు సంస్థలనే కాకుండా వ్యక్తుల ప్రతిష్టను దెబ్బతీస్తాయని ఉస్మానియా వైస్ ఛాన్సిలర్ డి.రవీందర్ అన్నారు. వార్తలను ప్రచురించడం లేదా ప్రసారం చేసే ముందు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలని ఆయన సూచించారు. సంబంధిత వ్యక్తుల నుంచి వివరణ తీసుకోవడం మరింత మంచిదని ఆయన సూచించారు. వంద రోజుల శిక్షణ ద్వారా జర్నలిస్టులు ఇప్పటికే తగిన ఫలితాలను రాబడుతున్నాయని ఉస్మానియా యూనివర్సీటీ జర్నలిజం హెడ్ ప్రొఫెసర్ స్టీవెన్ సన్ కోహిర్ అన్నారు.
నకిలీ వార్తలను....
శిక్షణ పొందిన వారు నకిలీ వార్తలను గుర్తించి అడ్డుకోగలుగుతున్నారని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కోర్సులో ప్రధాన బోధకులుగా ఉన్న ఉడుముల సుధాకర్ రెడ్డి, బీఎన్ సత్యప్రియ రచించిన వాస్తవ తనిఖీపై తెలుగులో ఉన్న రిసోర్స్ మెటీరియల్ ఎంతో ఉపయోగపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్ సీఎన్ పాయింటర్ లోని అంతర్జాతీయ శిక్షణ మేనేజర్ అలన్ననా సుజనా డ్వోరక్, కార్పస్ క్రిస్టీలోని టెక్సా్ అండ్ ఎం యూనివర్సిటీ ప్రొఫెసర్ అనంత సుధాకర్ బొబ్బిలి, ఫ్యాక్ట్ చెక్ శిక్షకులు ఉడుముల సుధాకర్ రెడ్డి, కొరీనా సురేష్, ప్రాజెక్టు సభ్యులు ఎస్. రాము, అబ్దుల్ బాసిత్ జర్నలిసజం విభాగం సిబ్బంది పాల్గొన్నారు.