Telangana : తెలంగాణ నిరుద్యోగ అభ్యర్థులకు గుడ్ న్యూస్

తెలంగాణలో నిరుద్యోగ అభ్యర్థులకు గుడ్ న్యూస్ అందింది. గ్రూప్ వన్ పరీక్షలకు హైకోర్టు ఓకే చెప్పింది.

Update: 2024-10-18 12:00 GMT

తెలంగాణలో నిరుద్యోగ అభ్యర్థులకు గుడ్ న్యూస్ అందింది. గ్రూప్ వన్ పరీక్షలకు హైకోర్టు ఓకే చెప్పింది. దీంతో నిరుద్యోగ అభ్యర్థులకు ఒకరకంగా శుభవార్త అందినట్లే. ఈనెల 21వ తేదీ నుంచి గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో కొందరు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పై హైకోర్టును ఆశ్రయించారు. గ్రూపు వన్ పరీక్షలపై దాఖలైన పిటీషన్లన్నింటినీ హైకర్టు డివిజన్ బెంచ్ కూడా కొట్టివేసింది. గతలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ కూడా సమర్థించింది.

ఈ నెల 21వ తేదీ నుంచి...
దీంతో ఈ నెల 21వ తేదీ నుంచి గ్రూప్ వన్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకూ ఈ పరీక్షలు జరగనున్నాయి. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. మెయిన్ పరీక్షల నిర్వహణ కోసం టీజీపీఎస్సీ మొత్తం నలభై ఆరు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది. గ్రూప్ వన్ పరీక్షకు మొత్తం 31 వేల మంది వరకూ అభ్యర్థులు ఎంపికయ్యారు. వీరంతా విడతల వారీగి పరీక్షలు రాయనున్నారు. టీజీపీఎస్సీ ఈ పరీక్షలను సమర్థవంతంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.


Tags:    

Similar News