Telangana : తెలంగాణలో గురుకులాల విద్యార్థులకు గుడ్ న్యూస్ .. మటన్ తో భోజనం
తెలంగాణలో గురుకులాల్లో ఉంటున్న విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మెనూలో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది
తెలంగాణలో గురుకులాల్లో ఉంటున్న విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మెనూలో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈరోజు ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ఇతర అధికారులు తనిఖీలు వెళుతున్న సందర్భంగా కొత్త మెనూను అమలు చేయాలని నిర్ణయించింది. ఇకపై గురుకులాల్లో ఉంటున్న విద్యార్థులకు నెలకు రెండు సార్లు మటన్ తో భోజనం పెట్టాలని నిర్ణయం తీసుకుంది.
చికెన్ తో నాలుగుసార్లు...
అలాగే నెలలో నాలుగు సార్లు చికెన్ తో భోజనం వడ్డించాలని నిర్ణయించింది. నాన్ వెజ్ లేని రోజుల్లో కోడిగుడ్డు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. బ్రేక్ ఫాస్ట్ లోనూ ఇడ్లి, వడ, పూరి, రాగిజావ, పాలు విత్ బూస్ట్ ను ఇవ్వాలని నిశ్చయించింది. ఇక సాయంత్రం స్నాక్స్ గా పండ్లు, బాయిల్డ్ పల్లీలు, మిల్లెట్ బిస్కెట్లు, అల్లం టీ ఇవ్వాలని డిసైడ్ చేసింది. విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించాలని ఈ నిర్ణయం తీసుకుంది.