Telangana : నేడు గ్రూపు 1 ప్రిలిమినరీ పరీక్ష.. ఏర్పాట్లు పూర్తి

నేడు తెలంగాణలో గ్రూప్ వన్ పరీక్షలు జరగనున్నాయి. ఇందుకోసం 897 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు

Update: 2024-06-09 02:59 GMT

నేడు తెలంగాణలో గ్రూప్ వన్ పరీక్షలు జరగనున్నాయి. ఇందుకోసం 897 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. గ్రూప్ వన్ ప్రిలిమినరీ రాత పరీక్ష కోసం 4.03 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షను ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని ఇప్పటికే టీజీపీఎస్సీ ఛైర్మన్ మహేందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రతి ఇరవై కేంద్రాలకు ఒక రీజనల్ కో ఆర్డినేటర్ ను నియమించారు.

ఉదయం 9 నుంచే...
ఈరోజు ఉదయం 10.30 గంటలనుంచి మధ్యాహ్నం ఒంటి గంటవరకూ పరీక్ష జరగనుంది. ఉదయం తొమ్మిది గంటల నుంచే అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించనున్నారు. అరగంట ముందే పరీక్ష కేంద్రాల గేట్లు మూసివేయనున్నారు. ఆ తర్వాత ఎవరినీ అనుమతించబోమని అధికారులు స్పష్టంచేశారు. అభ్యర్థులు ఏదైనా ఫొటో గుర్తింపు కార్డును వెంట తెచ్చుకోవాలని అధికారులు కోరారు. పరీక్షా కేంద్రాల్లోకి కాలిక్యులేటర్లు, పేజర్లు, సెల్‌ఫోన్లు, ట్యాబ్లెట్లు, పెన్‌డ్రైవ్‌లు, బ్లూటూత్‌ పరికరాలు, మ్యాథమెటికల్‌ టేబుల్స్‌, బ్యాగ్‌లు, ప్యాడ్‌ లు, ఇతర ఎలక్ట్రానిక్‌లను అనుమతించరు.


Tags:    

Similar News