తెలంగాణ ప్రజలకు అలర్ట్.. వచ్చే ఐదురోజులు జాగ్రత్త!

పగలు బయట తిరగలేక.. రాత్రి ప్రశాంతంగా నిద్రపోలేక అవస్థలు పడుతున్నారు ప్రజలు. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్న నేపథ్యంలో..

Update: 2022-03-28 11:42 GMT

హైదరాబాద్ : మార్చి రాకముందే.. మండే ఎండలు మొదలయ్యాయి. మార్చి చివరి వారానికి ఎండలు మరింత ముదురుతున్నాయి. రోజురోజుకూ పగటి ఉష్ణోగ్రతలతో పాటు రాత్రి ఉష్ణోగ్రతలూ పెరుగుతున్నాయి. ఫలితంగా పగలు బయట తిరగలేక.. రాత్రి ప్రశాంతంగా నిద్రపోలేక అవస్థలు పడుతున్నారు ప్రజలు. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్న నేపథ్యంలో.. తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.

రానున్న ఐదురోజుల్లో రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీల వరకూ పెరగవచ్చని తెలిపింది. కాబట్టి ప్రజలు అత్యవసరమైతే తప్ప బయట తిరగరాదని, జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అలాగే మరో మూడ్రోజుల వరకూ రాష్ట్రంలో వాతావరణం పొడిగా ఉంటుందని తెలిపింది. ఠారెత్తే ఎండలతో ప్రజలు ఇప్పటికే ఉక్కిరి బిక్కిరవుతున్న తరుణంలో.. వాతావరణ కేంద్ర హెచ్చరిక మరింత బెంబేలెత్తిస్తోంది.


Tags:    

Similar News