Hyderabad : వైన్ షాప్‌లను తొలిగించాలంటూ హయత్ నగర్ వాసులు ధర్నా..
హైదరాబాద్ హయత్ నగర్ డివిజన్ లో వైన్ షాప్ తొలిగించాలంటూ కాలనీ వాసులు ధర్నా.
Hyderabad : మద్యం షాపులతో సాధారణ ప్రజలకు ఎప్పుడూ ఇబ్బంది ఎదురవుతూనే ఉంటుంది. ఇక జనావాసాల మధ్య బార్ షాపులు పెట్టడం వల్ల అక్కడ నివసించే ప్రజలు.. తాగుబోతులు, పోకిరిలతో సమస్యలు ఎదుర్కోవడం అనేది తప్పదు. తాజాగా హైదరాబాద్ హయత్ నగర్ డివిజన్ లో వీరభద్ర కాలనీ వాసులు.. వైన్ షాప్ తొలిగించాలంటూ ధర్నా చేపట్టారు.
జనావాసాల మధ్య బార్ షాప్ లు పెట్టడం వల్ల తాగుబోతులు, పోకిరిల ఆగడాలు ఎక్కువ అయ్యాయని, అంతేకాకుండా మహిళలను కూడా ఇబ్బంది కలిగించేలా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రికి వెళ్లాలన్నా, బస్సుస్టాప్‌కి వెళ్లాలన్నా, మార్కెట్‌కి వెళ్లాలన్నా, పిల్లలు స్కూల్స్‌కి వెళ్లాలన్నా.. మద్యం షాప్ ఉండడంతో ఇబ్బంది కలుగుతుందని అసహనం వ్యక్తం చేస్తున్నారు.
తమని ఇబ్బందులకు గురి చేస్తున్న ఆ బార్ మరియు వైన్ షాప్‌లను తక్షణమే తొలిగించి తమకి న్యాయం చేయాలనీ కోరుతున్నారు. ఈక్రమంలోనే నేడు గురువారం డిసెంబర్ 21న ధర్నా చేపట్టారు. ఈ నిరసనలో హయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.