డేటా లీక్ కేసులో కీలక మలుపు

డేటా లీక్ కేసులో దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. ప్రముఖ 20 వెబ్‌సైట్లు డేటాని లీక్‌ చేసినట్లుగా గుర్తించారు

Update: 2023-04-11 01:38 GMT

డేటా లీక్ కేసులో దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. ప్రముఖ 20 వెబ్‌సైట్లు డేటాని లీక్‌ చేసినట్లుగా గుర్తించారు. దీంతో వెబ్‌సైట్లకు నోటీసులను సైబరాబాద్ పోలీసులు జారీ చేశారు. ఈ వెబ్‌సైట్లు డేటాను సైబర్ నేరగాళ్లకు అమ్ముకున్నట్లు గుర్తించి తక్షణం చర్యలకు దిగారు.

వెబ్‌సైట్‌లకు నోటీసులు...
డేటా లీక్ చేసిన వెబ్‌సైట్లకు నోటీసులు జారీ చేశారు. వారిని విచారించిన అనంతరం మరింత ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూసే అవకాశముందని చెబుతున్నారు. ఇప్పటికే 21 కంపెనీలకు నోటీసులు స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం అధికారులు నోటీసులు జారీ చేశారు. డేటా లీక్ పై కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్ అయి తమ దర్యాప్తు సంస్థల చేత విచారణ చేయిస్తుంది.


Tags:    

Similar News