వైఎస్ తర్వాత...
కాంగ్రెస్ కు ఇది కొత్త కాకపోయినా.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో దీనికి ఒకింత బ్రేకులు వేశారు. వైఎస్ ప్రశాంతంగా పాలన చేయగలిగారు. మళ్లీ ఆ తర్వాత కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా అందరినీ కలుపుకుని పోతూ పెద్దగా వ్యతిరేకత లేకుండా ఏడాది కాలం పాటు ముఖ్యమంత్రిగా బాధ్యతలను నిర్వహించింది రేవంత్ రెడ్డి అని చెప్పకతప్పదు. తెలంగాణ కాంగ్రెస్ లో నేతలకు కొదవలేదు. అరవై ఏళ్లు దాటి.. హస్తినలో ఫుల్లు ఫామ్ లో ఉన్న నేతలు అనేకమంది ఉన్నారేవంత్ అందరినీ కంట్రోల్ చేసుకుంటూ పాలనను సజావుగా నడుపుకొస్తున్నారు. నిజానికి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరు ప్రకటించినప్పుడు ఎవరూ ఇలాంటి పరిస్థితి ఉంటుందని ఊహించలేదు. సీనియర్ నేతలు కాళ్ల కింద నిత్యం కట్టెలు పట్టి పదవి నుంచి ఆరునెలల్లోనే దించేస్తారనుకున్నారు. నిరంతరం దూకుడుగా ఉండే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తగ్గి తాను అందరి వాడినన్న భావన నేతల్లో కలిగించారు.
సీనియర్ నేతలున్నా...
కానీ రేవంత్ రెడ్డి విషయంలో మాత్రం అందుకు భిన్నంగా జరుగుతుందని చెప్పాలి. సీనియర్ నేతలు మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్, జీవన్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి...ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది నేతలు. నేరుగా ఢిల్లీతో సత్సంబంధాలను నెరపగల నేతలు. ఆర్థికంగా, సామాజికపరంగా కూడా బలమైన నేతలు. ఇక సీనియర్ నేత వీహెచ్ లాంటి వాళ్లు సయితం సైలెంట్ అయిపోయారు. అయితే రేవంత్ లో ఉన్నదీ, వారిలో లేనిది ఒక్క వాగ్దాటి మాత్రమే. రేవంత్ మాటలకు ఒకింత విపక్షాలుసయితం ఆలోచనలో పడతాయి. సబ్జెక్ట్ పై అనర్గళంగా తెలంగాణ ప్రజలకు అర్థమయ్యే రీతిలో మాట్లాడేది రేవంత్ రెడ్డి మాత్రమే. ఒకరకంగా చెప్పాలంటే కేసీఆర్ తర్వాత రేవంత్ కు మించిన తెలంగాణలో క్రౌడ్ పుల్లర్ లేరనే చెప్పాలి.అదే రేవంత్ కు ప్లస్ గా మారింది. అందరినీ కలుపుకుని పోతూ, ఎమ్మెల్యేల నుంచి అందరినేతలను కలుస్తూ ముఖ్యమంత్రిగా పార్టీలో సెంట్ పర్సెంట్ మార్కులు కొట్టేశారు.
హైకమాండ్ కే అనుమానం...
అసలు తెలంగాణ కాంగ్రెస్ ఇదేనా?అన్నఅనుమానం హైకమాండ్ కు బయలుదేరే అవకాశముంది. ఎందుకంటే ఏడాది నుంచి ఎలాంటి ఫిర్యాదులులేవు. ఢిల్లీ ప్రయాణాలు లేవు. పదవుల కోసం పైరవీలు లేవు. అంతా సైలెన్స్. కాంగ్రెస్ నేతల్లో 99 శాతం మంది రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తున్నారంటే పార్టీలో ఆయన చాలా వరకూ సక్సెస్ అయినట్లే చెప్పుకోవాలి. కోమటిరెడ్డి వెంకటరెడ్డివంటి నేతలే మరోసారి సీఎం రేవంత్ రెడ్డి అని అన్నారంటే ఏ రేంజ్ లో రేవంత్ నేతలను దారికి తెచ్చారో అర్థం చేసుకోవచ్చు. మంత్రులకు ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా, సీనియర్ నేతలకు ఎప్పటికప్పడు అపాయింట్ మెంట్ ఇస్తూ రేవంత్ రెడ్డి ఏడాది కాలంలో తనపైన ఎలాంటి విమర్శలు పార్టీ నుంచి వినిపించకుండా చేస్తున్నారు. మల్లు భట్టివిక్రమార్క, ఉత్తమ్, కోమటిరెడ్డి, శ్రీధర్ బాబులను పక్కన పె్ట్టుకుని తాను అనుకున్నది చేస్తున్నారన్నది ఎంత నిజమో... రేవంత్ కు కాంగ్రెస్ లో తిరుగులేని నాయకుడిగా ఏడాది నుంచి ఉన్నారన్నది కూడా అంతేనిజం.