నేడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీలు బంద్

నేడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవుట్ పేషెంట్ విభాగంలో సేవలను నిలిపివేయనున్నట్లు జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ తెలిపింది.

Update: 2024-08-14 02:58 GMT

నేడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవుట్ పేషెంట్ విభాగంలో సేవలను నిలిపివేయనున్నట్లు జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ తెలిపింది. ఈరోజు మాత్రమే ఈ సేవలను బంద్ చేయనున్నట్లు తెలిపింది. కోల్‌కతాలో వైద్యురాలిపై హత్యాచారం జరిగిన నేపథ్యంలో వైద్య కళాశాలల్లో భద్రతకు సంబంధించి జాతీయ వైద్య కమిషన్‌ కీలక సూచనలు అమలు చేయాలని డిమాండ్ చేస్తుంది.

తెలంగాణలోని...
దేశవ్యాప్తంగా డాక్టర్లు, వైద్య విద్యార్థులు, ఫ్యాకల్టీకి కళాశాల, హాస్పిటల్‌ క్యాంపస్‌లలో భద్రతకు తగిన విధానాన్ని రూపొందించాలని సూచించింది. ఈ నేపథ్యంలో నేడు ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల్లో ఓపీ సేవలను పూర్తిగా నిలిపేస్తున్నట్లు జూనియర్ డాక్టర్లుతెలిపారు. అయితే వైరల్, డెంగ్యూ ఫీవర్ తో పేషెంట్లు అధికంగా వచ్చే సమయంలో బంద్ చేయడంతో రోగులు అవస్థలు పడే అవకాశముంది.


Tags:    

Similar News