ప్రధాని మోదీకి కేసీఆర్ లేఖ

ప్రధాని మోదీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాశారు. తెలంగాణలో వరి ధాన్యాన్ని ఎఫ్.సి.ఐ ద్వారా కొనుగోలు చేయాలని కోరారు

Update: 2021-11-17 12:15 GMT

ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాశారు. తెలంగాణలో వరి ధాన్యాన్ని ఎఫ్.సి.ఐ ద్వారా కొనుగోలు చేయాలని కోరారు. అన్ని రాష్ట్రాలనూ ఒకే మాదిరిగా చూడాలని, పంజాబ్ లో పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం, తెలంగాణలో ధాన్యం కొనుగోలుకు నిరాకరించడమేంటని కేసీఆర్ ప్రశ్నించారు.

ధాన్యం కొనుగోలుకు....
వరి ధాన్యం కొనుగోలు చేయాలని ఇప్పటికే సంబంధిత మంత్రిత్వ శాఖకు లేఖలు రాసినా యాభై రోజులుగా స్పందన లేదని కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు. వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేసేలా ఎఫ్.సి.ఐని ఆదేశింాలని కోరారు. కాగా రేపు ఇందిరా పార్క్ వద్ద ధాన్యం కొనుగోలు చేయాలంటూ టీఆర్ఎస్ మహాధర్నా చేయనుంది.


Tags:    

Similar News