అందుకే నేను అసెంబ్లీలో అలా మాట్లాడా : దానం నాగేందర్
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అసెంబ్లీలో తాను చేసిన వ్యాఖ్యలకు మరొకసారి వివరణ ఇచ్చుకున్నారు.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అసెంబ్లీలో తాను చేసిన వ్యాఖ్యలకు మరొకసారి వివరణ ఇచ్చుకున్నారు. ఆయన ఆదర్శనగరలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ తనను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రెచ్చగొట్టారన్నారు. తనపై అసభ్య పదజాలాన్ని వాడారన్నారు. తనతో పాటు ముఖ్యమంత్రిని కూడా దూషించారని దానం నాగేందర్ తెలిపారు.
తనను రెచ్చగొట్టే విధంగా...
తనను కావాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టార్గెట్ చేశారన్న దానం నాగేందర్ తాను హైదరాబాద్ అభివృద్ధి మీద మాట్లాడుతున్నప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పదే పదే అడ్డుతగులుతూ తనను అవమానపర్చేవిధంగా మాట్లాడరన్నారు. వారు అన్న మాటలేవీ రికార్డు కాలేదని, అందుకే తనకు కోపం వచ్చి సహనం కోల్పోయిన మాట వాస్తవమేనని తెలిపారు.