Telangana : నేడు తెలంగాణ బంద్

నేడు తెలంగాణ వ్యాప్తంగా బంద్ కు మావోయిస్టులు పిలుపు నిచ్చారు.

Update: 2024-12-09 02:37 GMT

నేడు తెలంగాణ వ్యాప్తంగా బంద్ కు మావోయిస్టులు పిలుపు నిచ్చారు. ములుగు జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ కు నిరసనగా ఈ బంద్ కు పిలుపు నిచ్చినట్లు తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ పాలన ఏడాది పూర్తవుతున్న సందర్భంగా సంబురాలు చేసుకున్న సమయంలో మావోయిస్టులు బంద్ కు పిలుపు నివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు నిఘా పెంచారు. విస్తృతంగా తనిఖీలను నిర్వహిస్తున్నారు.

ఎన్ కౌంటర్ కు నిరసనగా...
సరిహద్దు జిల్లాలైన తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్ గడ్ లలో మావోయిస్టుల కోసం జల్లెడ పడుతున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ఇప్పటికే దుకాణాలు బంద్ అయ్యాయి. ములుగు జిల్లలో కొందరు వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఎన్ కౌంటర్ కు నిరసనగా బంద్ జరుగుతుండటంతో పోలీసులు అప్రమత్తమై అన్ని రకాలుగా చర్యలు చేపట్టారు.

ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Download The App Now

Tags:    

Similar News