Telangana : తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ సమావేశం
తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ శాసనసభ్యులు, మండలి సభ్యులతో సమావేశం జరుగుతుంది
తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ శాసనసభ్యులు, మండలి సభ్యులతో సమావేశం జరుగుతుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవించిన తర్వాత నిర్భంధ రాజ్యం నడుస్తుందని వారు ఆరోపిస్తున్నారు. కనీసం అసెంబ్లీ సమావేశాలకు రానివ్వుండా అడ్డుకున్నారని వారు చెబుతున్నారు. గత పదేళ్లుగా కేసీఆర్ చేసిన అభివృద్థిని చూసి ఓర్వలేక డైవర్షన్ పాలిటిక్స్ కు అధికార పార్టీ దిగుతుందని వారు ఆరోపిస్తున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం రూపకల్పనపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అంతకు ముందు అసెంబ్లీ వద్ద అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తెలంగాణ భవన్ లకు చేరుకుకున్నారు.
రేపటి సమావేశాల్లో...
కేసీఆర్ చేసిన పనులు కనపడకుండా చేయడానికే ఈ ప్రభుత్వం ఇలాంటి మార్గాలను ఎంచుకుందని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. అందుకే ఈ ప్రభుత్వం తెలంగాణ ప్రజల మనోభావాలను కూడా గౌరవించకుండా వ్యవహరిస్తుందని, ఇలాంటి వారు ఇచ్చిన హామీలను అమలు చేస్తారా? అని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలలో ఎలాంటి రకమైన వ్యూహాలను అనుసరించాలన్న దానిపై వారు సమాలోచనలు చేయడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. పేద ప్రజలకు అండగా ఉభయ సభల్లో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమవ్వాలని కేటీఆర్ సభ్యులను కోరారు.