Weather Alert : తెలంగాణలో ఎల్లో అలెర్ట్.. భారీ వర్షాలు రానున్న రెండురోజుల్లో ఈదురుగాలులు కూడా
ఎండలు మండిపోతున్న సమయంలో వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. మరో మూడు రోజుల పాటు తెలంగాణలో వర్షాలు పడే అవకాశముంది
Weather Alert :ఎండలు మండిపోతున్న సమయంలో వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. మరో మూడు రోజుల పాటు తెలంగాణలో వర్షాలు పడే అవకాశముంది.ఈ మేరకు వాతావరణ శాఖ తెలిపింది. అనేక జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈదురుగాలులు కూడా వీసే అవకాశముందని తెలిపింది. ముప్ఫయి నుంచి నలభై కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. అనేక జిల్లాల్లో ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
ఈ జిల్లాల్లో...
ప్రధానంగా తెలంగాణలోని హైదరారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్‌గిరి తదితర ప్రాంతాలతో పాటు వరంగల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, నల్లొండ, వికారాబాద్, కుమురం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ములుగు, నాగర్ కర్నూల్, ములుగు, గద్వాల, నారాయణపేట జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. మహారాష్ట్ర నుంచి కర్ణాటక మీదుగా ఉత్తర కేరళ వరకూ ద్రోణి కొనసాగుతున్నందున వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.
ఏపీలో కూడా...
ఆంధ్రప్రదేశ్ లోనూ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల శాఖ ప్రకటించింది. జార్ఖండ్ నుంచి ఒడిశా మీదుగా ఉత్తర కోస్తాంధ్ర వరకూ కొనసాగుతున్న ద్రోణి కారణంగా కోస్త్రాంధ్రలో వర్షాలు కురిసే అవకాశముందని చెప్పింది. రాగల రోజుల్లో అనేక జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని, ఈదురుగాలులు కూడా వీస్తాయని పేర్కొంది. కోస్తాంధ్ర జిల్లాల్లో అయితే ఆరు నుంచి పన్నెండు సెంటీ మీటర్ల వర్షం పడే అవకాశముందని రైతులు అప్రమత్తంగా ఉండాలని కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఉరుములు పడే అవకాశమున్నందున పొలాల్లో, మైదాన ప్రాంతాల్లో ప్రజలు ఉండకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. మండే ఎండల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొనడం చాలా వరకూ ఉపశమనంగా చెప్పాలి.