మునుగోడు అభివృద్ధి ఇక పరుగులే

మునుగుడో అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు. మునుగోడు అభివృద్ధి పనులపై సమీక్షించారు

Update: 2022-12-01 12:11 GMT

మునుగుడులో అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు. మునుగోడు అభివృద్ధి పనులపై మంత్రులు సమీక్షించారు. గత ప్రభుత్వాలు ఇక్కడ మెడికల్ కళాశాల కూడా తేలేకపోయాయని చెప్పారు. నల్లగొండ జిల్లాలో 12 నియోజకవర్గాలు టీఆర్ఎస్ క అప్పగించినందున జిల్లా అభివృద్ధికి అందరం కలసి కృషి చేస్తామని తెలిపారు. యాదాద్రి క్షేత్రాన్ని ఇప్పటికే కేసీఆర్ అద్భుతంగా తీర్చిదిద్దారని, కోట్లాది మంది ఆలయాన్ని సందర్శించుకునేలలా పునర్నించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తిరుమలకు దీటుగా యాదాద్రి రూపుదిద్దుకోవడం ఆనందదాయకమని తెలిపారు.

ఇచ్చిన హామీలన్నీ...
ఎన్నికల సమయంలో మునుగోడుకు ఇచ్చిన హామీలను అమలు చేస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. రోడ్లు యుద్ధప్రాతిపదికమీద అభవృద్ధి చేయడానికి వంద కోట్లు నిధులు విడుదల చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రాబోయే ఆరేడు నెలల్లో 1,544 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని ప్రకటించారు. నారాయణపూర్ లో బంజారాభవన్ ను నిర్మించనున్నామని తెలిపారు. ఉమ్మడి నల్లగొండ అభివృద్ధి కోసం సంపూర్ణమైన రోడ్ మ్యాప్ ను రూపొందించుకున్నామన్న కేటీఆర్ త్వరలోనే అభివృద్ధి పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. ఎన్నికలకు ముందు చెప్పిన మాటలన్నీ ఆచరణలో పెడతామని ఆయన తెలిపారు. తండాల్లో వంద కోట్లతో అభివృద్ధి పనులను చేపడతామని కేటీఆర్ చెప్పారు.


Tags:    

Similar News