దేశంలో అలాంటి మగాడున్నాడా ? : మంత్రి కేటీఆర్
రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్నది ఎవరో ఆలోచించాలని కేటీఆర్ సూచించారు. వ్యవస్థలను కుప్పకూల్చుతూ..
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి, టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా.. కేటీఆర్ మాట్లాడుతూ దేశంలో దళితులకు రూ.10 లక్షలు ఇచ్చిన మగాడు ఉన్నాడా? అంటూ ప్రశ్నించారు. తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం దళితుల అభ్యున్నతి కోసం దళిత బంధు పేరిట ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ఇచ్చే పథకానికి రూపకల్పన చేశామన్నారు.
రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్నది ఎవరో ఆలోచించాలని కేటీఆర్ సూచించారు. వ్యవస్థలను కుప్పకూల్చుతూ.. వ్యవస్థలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తుంది ఎవరో ఇప్పటికైనా తెలుసుకోవాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం మంచిపనులు చేస్తుంటే.. కేంద్రం అడ్డుపడుతుందని విమర్శించారు. దళితులకు రూ.10 లక్షలు ఇచ్చిన మగాడు దేశంలో ఉన్నాడా? బలహీన వర్గాల కోసం బలంగా పనిచేసే సీఎం ఈ దేశంలో ఎక్కడైనా ఉన్నాడా? అని కేంద్రాన్ని నిలదీశారు.