Chief Ministers Meeting : సమస్యల పరిష్కారానికి మొత్తం మూడు మార్గాలు

ముఖ్యమంత్రుల సమావేశంలో చర్చించిన విషయాలను మంత్రులు భట్టి విక్రమార్క వెల్లడించారు

Update: 2024-07-06 15:51 GMT

ముఖ్యమంత్రుల సమావేశంలో చర్చించిన విషయాలను మంత్రులు భట్టి విక్రమార్క వెల్లడించారు. ఏపీ నుంచి మంత్రి అనగాని సత్యప్రసాద్ మీడియా సమావేశంలో తెలిపారు. గత పదేళ్లుగా పరిష్కరానికి కాని సమస్యలపై చర్చించడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశామని తెలిపారు. విభజన అంశంలోని చట్టాల్లోని అనేక అంశాలతో పాటు అనేక విషయాలపై లోతుగా చర్చించామని తెలిపారు. ఈ సమావేశం ద్వారానే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఎవరూ అనుకోలేదన్నారు. ఈ సమావేశంలో ఉన్నత స్థాయి అధికారులతో కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించామని తెలిపారు. చీఫ్ సెక్రటరీ నేతృత్వంలో ముగ్గురు అధికారులతో రెండు రాష్ట్రాల అధికారులు పాల్గొంటారని తెలిపారు.

మంత్రులు.. ముఖ్యమంత్రులు...
ఉన్నతస్థాయి అధికారుల కమిటీ ద్వారా పరిష్కారం కాని సమస్యలు ఏవైనా రెండు రాష్ట్రాలకు చెందిన మంత్రులతో కూడిన కమిటీని వేయాలని నిర్ణయించామని తెలిపారు. ఒకవేళ మంత్రుల స్థాయిలో కమిటీ వద్ద కూడా సమస్యలు పరిష్కారం కాకుంటే మరోసారి ముఖ్యమంత్రులు భేటీ అయి చర్చిస్తారన్నారు. తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ కు, సైబర్ క్రైమ్ కు వ్యతిరేకంగా రెండు రాష్ట్రాలు సమన్వయంతో కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించామని తెలిపారు. అడిషినల్ డీజీ స్థాయిలో రెండు రాష్ట్రాల నుంచి కమిటీలో ఉంటారన్నారు.


Tags:    

Similar News