చంచల‌్‌గూడ జైలులో షర్మిల
పోలీసులపై దాడి చేసిన కేసులో వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిలకు నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది.
పోలీసులపై దాడి చేసిన కేసులో వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిలకు నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది. షర్మిలను అరెస్ట్ చేసిన పోలీసులు తొలుత గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. తాను పోలీసులపై దాడి చేయలదేని, తనను తాను కాపాడుకునేందుకు పోలీసులను నెట్టానని మాత్రమే వైఎస్ షర్మిల తరుపున న్యాయవాదులు వాదించారు.
వచ్చే నెల 8 వరకూ...
అయితే ప్రభుత్వం తరుపున న్యాయవాది మాత్రం షర్మిల కావాలనే పోలీసులపై దాడికి తెగబడ్డారని అన్నారు. చివరకు వచ్చే నెల 8వ తేదీ వరకూ వైఎస్ షర్మిలకు నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ప్రత్యేక వాహనంలో చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈరోజు షర్మిల తరుపున న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించి బెయిల్ కోసం దరఖాస్తు చేయనున్నారని చెబుతున్నారు. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో షర్మిల ఉన్నారు.