Narendra Modi:ముగిసిన ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన.. రేవంత్ రెడ్డి ఏమి కోరారంటే?
ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన ముగిసింది. రెండు రోజుల పాటు ఆయన తెలంగాణలో
Narendra Modi:ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన ముగిసింది. రెండు రోజుల పాటు ఆయన తెలంగాణలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఆదిలాబాద్, సంగారెడ్డి బీజేపీ విజయ సంకల్ప సభలలో పాల్గొని క్యాడర్ ను ఉత్సాహపరిచారు. గత రాత్రి హైదరాబాద్ చేరుకున్న ప్రధాని రాజ్ భవన్‌లో బస చేశారు. ఉదయం తెలంగాణలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పటేల్‌గూడ సభ అనంతరం హైదరాబాద్ చేరుకొని అక్కడి నుంచి బేగంపేట విమానాశ్రయం నుంచి ఒడిశాకు బయలుదేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని మోదీకి వీడ్కోలు పలికారు. వీడ్కోలు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం రేవంత్ రెడ్డి ఓ లిస్టు ఇచ్చారు. అందులో మొత్తం 11 విజ్ఞప్తులు చేశారు. కేంద్రం నుంచి సహకారం కావాలని అన్నారు. ఇంటింటికీ నల్లా, ఐపీఎస్ క్యాడర్ పెంపు, హైదరాబాద్-రామగుండం, హైదరాబాద్-నాగపూర్ రహదారిపై రక్షణ శాఖ భూముల మీదుగా ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం, హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారిపై అమ్రాబాద్ ఫారెస్ట్ ఏరియా మీదుగా ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ఆర్థిక మద్దతు, ఎన్టీపీసీలో 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి కేంద్ర సహకారం, భారత్ మాలలో తెలంగాణకు ప్రాధాన్యత, తెలంగాణలో సెమీ కండక్టర్ల తయారీ, హైదరాబాద్ మెట్రో విస్తరణ, అభివృద్ధి, మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి, తుమ్మిడిహెట్టి ఎత్తిపోతల ప్రాజెక్టు అంశంతదితర అంశాల్లో సహకారం కోరుతూ సీఎం రేవంత్ రెడ్డి లేఖను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అందించారు.