Mlc Bypoll : నేడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలకు చెందిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు
నేడు తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరగనుంది. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలకు చెందిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకూ ఎన్నిక జరుగుతుంది. పోలింగ్ కు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. జూన్ 5వ తేదీన కౌటింగ్ జరగనుంది. ఈ ఎన్నికలలో మొత్తం 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
2027 మార్చి వరకూ...
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఈ ఎన్నిక అనివార్యమయింది. ఇప్పుడు గెలిచే ఎమ్మెల్సీ 2027 మార్చి వరకూ ఎమ్మెల్సీ పదవిలో కొనసాగుతారు. ప్రధాన పార్టీలన్నీ తమ అభ్యర్థులను బరిలోకి దించాయి. బ్యాలెట్ పత్రాల ద్వారా ఈ ఎన్నిక జరగనుంది.