తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఆలస్యం అవుతాయా? ఎందుకు?

తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఆలస్యం కావచ్చని, పార్లమెంట్‌తో్ పాటు వచ్చే ఏడాది మే నెలలో జరిగినా పెద్దగా..

Update: 2023-09-13 06:09 GMT

తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఆలస్యం కావచ్చని, పార్లమెంట్‌తో్ పాటు వచ్చే ఏడాది మే నెలలో జరిగినా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని మంత్రి కేటీఆర్‌ ఇటీవల వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. భారత ప్రజాస్వామ్యంలో ఇలా రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలు ఆలస్యం కావడం అనేది జరగలేదు. ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ పదవీ కాలం పూర్తయ్యేలోపుగా కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు ఎన్నికలు జరుగుతాయి. కానీ ఈ సారి ఆలస్యమైన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.

జమిలీ ఎన్నికలు అమలు అయితే..

కాగా, ఈ సారి జమిలి ఎన్నికల ఆశం కేంద్ర ప్రభుత్వం లేనెత్తింది. కేంద్రం జమిలీ ఎన్నికలకు ప్రణాళికలు వేస్తోంది. ఈ కారణం వల్ల ప్రత్యేకంగా రాజ్యాంగ సవరణ చేసి డిసెంబర్‌లో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఆలస్యం చేయనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ నిజంగానే ఇలా ఆలస్యం చేస్తే తెలంగాణలో రాజకీయ పరిస్థితి ఏంటీ అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
జమిలీ ఎన్నికల కోసం రాజ్యాంగ సవరణ చేసినట్లైతే.. ఎన్నికలు వచ్చే ఏడాది మే నెలలో నిర్వహిస్తారు. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ పదవీ కాలం జనవరి రెండో వారానికి ముగుస్తుంది. మరి జమిలీ ఎన్నికలు జరిగినట్లయితే తెలంగాణ ప్రభుత్వం జనవరితో ముగియనుంది. అప్పుడు మే నెల వరకు ప్రభుత్వ పాలనను పొడిగించే అవకాశం ఉండదు. అలాంటప్పుడు ఏ పాలన విధిరన్నది ప్రశ్న. అప్పుడు ప్రజాప్రతినిధులు గానీ, ప్రభుత్వం గానీ ఉండదు. ముఖ్యమంత్రి కూడా ఉండరు. రాజ్యాంగ సవరణలో ప్రభుత్వ పదవీ కాలాన్ని ఆరు నెలలు పొడగిస్తూ ఏదైనా మార్పులు చేసినట్లైతే.. అప్పుడు అవకాశాలు ఉండే అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుత రాజ్యాంగం ప్రకారం ఏర్పాటైన ప్రభుత్వాన్ని కొత్తగా చేసే సవరణలతో పొడగిస్తే ఎలా ఉంటుందనే ప్రశ్న తలెత్తుతోంది. ఐదేళ్లపాటు ఉండే ప్రభుత్వాన్ని మళ్లీ పొడిగించేందుకు రాజ్యంగం ఒప్పుకోదు. అలాంటి పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలు ఉంటాయి.
అయితే ఇటీవల కాలంలో రాష్ట్రపతి పాలన విధించిన సంఘటనలు ఎక్కడలేవు. ఒక వేళ జమిలీ ఎన్నికల కోసం ప్రభుత్వ పదవీ కాలాన్ని పొడగించినట్లేతే బీఆర్ఎస్ ఇష్టం లేకున్నా తప్పకుండా అంగీకరించాల్సి ఉంటుంది. కానీ రాష్ట్రపతి పాలనను మాత్రం వ్యతికించే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మరి జమిలీ ఎన్నికలు అమలు అవుతాయా? లేదా అన్నది వేచి చూడాలి.

కేటీఆర్‌ వ్యాఖ్యలపై కిషన్‌ రెడ్డి ఏమన్నారు..?

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఆలస్యం కావచ్చన్న వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పందించారు. కేంద్ర సమాచారం ప్రకారం.. సమయంలోనే కేంద్రం అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తుందని అన్నారు. ఎన్నికలు ఆలస్యం అవుతాయని కేటీఆర్‌ ఎందుకు మాట్లాడరో అర్థం కావడం లేదని, ఏదీ ఏమైనా ఈ ఏడాది చివర్‌లోనే అసెంబ్లీ ఎన్నికలు జరిగి తారుతాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగానే ఉందన్నారు.


Tags:    

Similar News