"మా ఇంటికి రాకండి" వెరైటీ నోటీస్
మా ఇంటికి రాకండి అంటూ దొంగలకు వెరైటీగా ఒక నోటీసు బోర్డు అంటించి వెళ్లాడు ఇంటియజమాని. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది
మా ఇంటికి రాకండి అంటూ దొంగలకు వెరైటీగా ఒక నోటీసు బోర్డు అంటించి వెళ్లాడు ఇంటియజమాని. ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సంక్రాంతికి అందరూ సొంతూళ్లకు వెళతారు. వలసలు సెలవులు రావడం, పెద్ద పండగకు సొంత ఇంటికి వెళ్లడం మామూలే. ప్రతి వాళ్లు తమ ఊళ్లకు వెళుతు విలువైన వస్తువులను భద్రపరచుకుని పోతారు. దొంగలు ఇదే సమయంగా భావించి చోరీలకు పాల్పడతారు.
దొంగలు కూడా...
పండగ సమయంలో పోలీసులు కూడా తమకు చెప్పి వెళ్లాలని, తాము ఆ ప్రాంతంలో గస్తీ తిరుగుగుతుంటామని చెబుతుంటారు. అందరికీ బ్యాంకులలో లాకర్ల సౌకర్యం ఉండకపోవడంతో ఇంట్లోనే బంగారం, వెండి వస్తువులను పెట్టి వెళతారని భావించి దొంగలు ఇదే సమయమమని రెచ్చిపోతారు.
ఈ ఇంటి యజమాని మాత్రం...
అయితే ఒక ఇంటి యజమాని మాత్రం తాను ఊరికి వెళుతూ తన తలుపునకు అంటించి వెళ్లిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నవ్వు తెప్పిస్తుంది. తాము సంక్రాంతి పండగకు ఊరికి వెళుతున్నామని, డబ్బు, నగలు అన్నీ తమ వెంట తీసుకు వెళుతున్నామని, మా ఇంటికి రాకండి.. ఇట్లు మీ శ్రేయోభిలాషి అంటూ రాసి తాళం వేసుకుని ఊరికెళ్లాడు.