కేటీఆర్ కు రేవంత్ కౌంటర్

మంత్రి కేటీఆర్ విమర్శలకు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ కు ఆయన సవాల్ విసిరారు

Update: 2023-02-09 11:59 GMT

మంత్రి కేటీఆర్ విమర్శలకు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ కు ఆయన సవాల్ విసిరారు. డ్రామారావు వేల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని అన్నారు. ప్రభుత్వ భూములను కేటీఆర్ తో పాటు, ఆయన మిత్రులు కొల్లగొట్టారన్నారు. సంగారెడ్డి, రంగారెడ్డి, మెదక్ లో అనేక ప్రభుత్వ భూములను అనేకం సొంతం చేసుకున్నారన్నారు. నిషేధిత జాబితాలో ఉన్న భూములను తొలగించారన్నారు. వేల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారు. 500 కోట్ల విలువైన భూమి కవిత పేరు మీద ఎలా రిజిస్టర్ అయిందని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

భూముల ఆక్రమణ...
తోట చంద్రశేఖర్ కు చెందిన ఆదిత్య కనస్ట్రక్షన్స్ కు ధరణి పోర్టల్ ను అడ్డం పెట్టుకుని దందా చేశారన్నారు. ఆ సంస్థ పేరు మీద బదలాయించుకున్నారన్నారు. ఎన్ఓసీ కూడా ఇచ్చారన్నారు. తాను చేస్తున్న ఆరోపణలపై కేటీఆర్ విచారణకు సిద్ధమవ్వాలన్నారు. కేటీఆర్ కొల్లగొట్టిన భూములు ఎవరెవరి పేర్లపై బదలాయించారో బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. నిజాం కాలం ముందు నుంచి ప్రభుత్వం ఆధీనంలో ఉన్న భూములను కొల్లగొట్టారన్నారు. తనపై కేటీఆర్ చేసిన ఆరోపణలకు సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని, అందుకు తాను సిద్ధంగా ఉన్నానని రేవంత్ రెడ్డి తెలిపారు.


Tags:    

Similar News