మునుగోడును నేను దత్తత తీసుకుంటా

మునుగోడు నియోజకవర్గాన్ని తాను దత్తత తీసుకుంటానని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు

Update: 2022-10-12 12:50 GMT

మునుగోడు నియోజకవర్గాన్ని తాను దత్తత తీసుకుంటానని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. మునుగోడులో రాజగోపాల్ రెడ్డి తన ఓటు తానే వేసుకోలేరన్నారు. కాంగ్రెస్ ను గెలిపిస్తే తాను సోనియా, రాహుల్ ను మునుగోడుకు తీసుకువస్తానని చెప్పారు. 22 వేల ఓట్ల మెజారిటీతో గెలిపిస్తే 22 వేల కోట్లకు కోమటిరెడ్డి అమ్ముడుపోయారని రేవంత్ ధ్వజమెత్తారు. ఎస్సీ రిజర్వేషన్లను తెచ్చింది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని అన్నారు. మునుగోడు ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఎవరు ఎమ్మెల్యే, ఎంపీ అయినా అది కాంగ్రెస్ ఇచ్చిన అవకాశమేనని అన్నారు.

మహిళకు అండగా...
ఈరోజు కొందరు అంగీ మార్చారని, మరికొందరు జెండాలు మార్చారని రేవంత్ రెడ్డి అన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పెంచి పోషిస్తే చివరకు అందరిని మోసం చేసి పార్టీని వీడి వెళ్లారన్నారు. టీఆర్ఎస్ ఇప్పటి వరకూ దిండి ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే అయిన ఏ ఒక్కరూ సమస్యను పరిష్కరించలేదన్నారు. ఈసారి మునుగోడులో ఆడబిడ్డను గెలిపించాలన్నారు. ఈసారి పాల్వాయి స్రవంతికి అవకాశం ఇవ్వాలని రేవంత్ రెడ్డి పిలుపు నిచ్చారు. మహిళలు అందరూ పాల్వాయి స్రవంతికి అండగా నిలబడాలని కోరారు.


Tags:    

Similar News