మంత్రి కేటీఆర్ ను జైలులో పెట్టాల్సిందే

మంత్రి కేటీఆర్ ను అరెస్ట్ చేసి జైలులో పెట్టాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారరు. కామారెడ్డి లో రేవంత్ దీక్ష చేపట్టారు

Update: 2023-03-19 08:20 GMT

మంత్రి కేటీఆర్ ను అరెస్ట్ చేసి జైలులో పెట్టాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారరు. కామారెడ్డి జిల్లా గాంధారిలో రేవంత్ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2015 వరకూ ఇప్పటి వరకూ జరిగిన ప్రశ్నాపత్రాల లీకేజీలో అనేక మంది లబ్ది పొందారని ఆయన ఆరోపించారు. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీలో కేవలం ఇద్దరికి మాత్రమే సంబంధం ఉందని కేటీఆర్ ఎలా చెబుతారని ఆయన ప్రశ్నించారు. కేటీఆర్ ను బర్త్‌రఫ్ చేయకుండా చంచల్‌గూడ జైలులో పెట్టాలని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. టీఎస్‌పీఎస్సీలో ఉద్యోగం చేస్తూ ఎలా పరీక్షలు రాస్తారని ఆయన ప్రశ్నించారు.

పీఏ హస్తం...
మంత్రి కేటీఆర్ పీఏ తిరుపతి, ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో నిందితుడు రాజశేఖర్ ది దాదాపు ఒక ఊరు మాత్రమేనని అన్నారు. వీరిద్దరూ పాత మిత్రులని ఆయన తెలిపారు. ఇద్దరూ జగిత్యాల జిల్లాకు చెందిన మాల్యాల మండలానికి చెందిన ఇద్దరూ ఈ ప్రశ్నాపత్రాల లీకేజీలో భాగస్వామ్యం ఉందన్నారు. రాజశేఖర్ కు ఉద్యోగం ఇప్పించింది మంత్రి కేటీఆర్ అని ఆయన ఆరోపించారు. కేటీఆర్ కు పీఏ తిరుపతి షాడో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారన్నారు. వారిద్దరికీ సన్నిహితులైన వారికి అత్యధికంగా మార్కులు వచ్చాయని తెలిపారు. గ్రూప్ 1లో వంద మార్కులు వచ్చిన వారి పేర్లన్నీ బయట పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.


Tags:    

Similar News