BRS : ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి పోలీసులు నోటీసులు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 27వతేదీ ఉదయం పది గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇటీవల పోలీసు స్టేషన్ కు వచ్చిఅధికారుల విధులకు ఆటంకం కలిగించారన్న దానిపై పాడి కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తర్వాత హరీశ్ రావు, పాడి కౌశిక్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు.
బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో...
బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన కేసులో విచారించడానికి పాడి కౌశిక్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన వారిని వదిలిపెట్టవద్దని ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన సూచనలతో మరోసారి పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు విచారించేందుకు ఈ నోటీసులు ఇచ్చారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now