హైకోర్టును ఆశ్రయించిన కేసీఆర్

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఎమ్మెల్యే హరీశ్‌రావులు హైకోర్టును ఆశ్రయించారు.

Update: 2024-12-24 02:30 GMT

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఎమ్మెల్యే హరీశ్‌రావులు హైకోర్టును ఆశ్రయించారు. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో అవినీతి జరిగిందనే అంశంపై భూపాలపల్లి కోర్టు ఇచ్చిన నోటీసులను కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో క్వాష్ పిటిషన్లు వేశారు. కాగా మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో అవినీతి జరిగిందనే అంశంపై భూపాలపల్లిలో కేసు నమోదైంది.


భూపాలపల్లి కోర్టు ఇచ్చిన...

దీనిపై కేసీఆర్, హరీశ్‌రావుకు భూపాలపల్లి కోర్టు నోటీసులు ఇచ్చింది. దీనిపై వీరిద్దరూ హైకోర్టును ఆశ్రయించారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడంతో వీరిద్దరిపై కేసు నమోదయిన సంగతి తెలిసిందే. మరొక వైపు కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పినాకీ ఘోష్ కమిషన్ విచారణ ప్రారంభించిన నేపథ్యంలో వీరు ముందుగానే తమపై నమోదయిన కేసులను క్వాష్ చేయాలని హైకోర్టులో పిటీషన్ వేశారు.





Tags:    

Similar News