నేడు మెదక్ జిల్లాకు ఉప రాష్ట్రపతి

భారత ఉప రాష్ట్రపతి జగదీప్ థన్ కడ్ నేడు మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు.

Update: 2024-12-25 02:46 GMT

భారత ఉప రాష్ట్రపతి నేడు మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు. ఉపరాష్ట్రపతి జగదీప్ థన్ కడ్ మధ్యాహ్నం 2.20 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ లో బయలుదేదరి తునికి విజ్ఞాన కేంద్రానికి చేరుకుంటారు. ఆయన వెంట గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కూడా వస్తారు. అక్కడ సేంద్రీయ పంటలు సాగు చేస్తున్న రైతులతో ఉపరాషష్రపతి మాట్లాడతారు. వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ను పరిశీలిచనున్నారు.

పోలీసుల భారీ బందోబస్తు...
అనంతరం తిరిగి మెదక్ జిల్లా పర్యటనను ముగించుకుని హైదరాబాద్ కు 4.30 గంటలకు చేరుకోనున్నారు. ఉప రాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు మంత్రులు కొండా సురేఖ, దామోదర రాజనరసింహ స్వాగతం పలకనున్నారు. మెదక్ జిల్లాలో నేడు ముఖ్యమంత్రితో పాటు ఉపరాష్ట్రపతి పర్యటిస్తుండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేస్తున్నారు. మెదక్ చర్చి వద్ద పోలీసు బలగాలను మొహరించారు. చర్చి వద్దకు ఎలాంటి వాహనాలను అనుమతించకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు.

ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App నౌ 


 

Tags:    

Similar News