Revanth Reddy : నేడు మెదక్ జిల్లాకు రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం పదకొండు గంటలకు మెదక్ కు ప్రత్యేక హెలికాప్టర్ లో రేవంత్ రెడ్డి చేరుకోనున్నారు. ఆయనతో పాటు మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసులురెడ్డి, దామోదర రాజనరసింహ కూడా రానున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన ఏడుపాయాల ఆలయానికి వెళ్లనున్నారు. అక్కడ అమ్మవారిని దర్శించుకుంటారు.
మెదక్ చర్చిలో....
ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా మెదక్ చేరుకుని చర్చికి చేరుకుంటారు. మెదక్ చర్చి వందేళ్ల వేడుకల్లో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. క్రిస్మస్ సోదరులకు శుభాకాంక్షలకు తెలియజేసిన అనంతరం అక్కడి నుంచి బయలుదేరి హైదరాబాద్ కు చేరుకుంటారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App నౌ