Liquor Rates : మద్యం కోసం ఇక తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లాల్సిందేనా?
ఆంధ్రప్రదేశ్ లో మద్యం కొత్త విధానం అమలులోకి తెచ్చింది. అన్ని బ్రాండ్లు అందుబాటులోకి వచ్చాయి
ఆంధ్రప్రదేశ్ లో మద్యం కొత్త విధానం అమలులోకి తెచ్చింది. అన్ని బ్రాండ్లు అందుబాటులోకి వచ్చాయి. ఇక ధరలను చూస్తే తెలంగాణలో కంటే ఆంధ్రప్రదేశ్ లో కొంత తగ్గినట్లే కనిపిస్తున్నాయి. గతంలో మద్యం కోసం ఏపీ నుంచి తెలంగాణకు వచ్చిన మందు బాబులు ఇప్పుడు తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లే పరిస్థితులు నెలకొన్నాయి. ఏపీలో మద్యం ధరలను తగ్గిస్తూ బ్రాండ్లు తయారు చేస్తున్న అన్ని ప్రముఖమైన కంపెనీలు తగ్గించాయి. ఏపీ ప్రభుత్వం నియమించిన కమిటీ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. మద్యం ప్రియుల నుంచి ప్రభుత్వంపై వ్యతిరేకత రావడంతో చంద్రబాబు ఈ విషయంపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఒకే కంపెనీకి చెందిన...
ఒకే కంపెనీకి చెందిన మద్యం తెలంగాణలోనూ, ఆంధ్రప్రదేశ్ లో నూ ఒకే కంపెనీ సరఫరా చేస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్‌లో బేసిక్ ధర మీద 20 శాతం వరకూ ధర తగ్గించుకున్న కంపెనీలు మాత్రం తెలంగాణలో మాత్రం 30 శాతం అదనంగా ధర పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. మద్యం ధరల ఖరారుకు రెండు రాష్ర్టాల ప్ర భుత్వాలు విడివిడిగా కమిటీలు వేశాయి. ఆంధ్రప్రదేశ్‌లో పదకొండు బ్రాండెడ్ మద్యం కంపెనీలు తమకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తున్న బేసిక్ ధర మీద 20 శాతం మేరకు ధరలను తగ్గించుకుంటున్నట్టు ప్రకటించాయి. దేశంలో తయార య్యే విదేశీ మద్యం వెరైటీలపై 5 నుంచి 12 శాతం, ఇతర క్యాటగిరీల మద్యంపై 20 శాతం బేసిక్ ధర తగ్గించుకుంటున్నట్టు వెల్లడించాయి. దీంతో ఏపీలో మద్యం ధరలు భారీగా తగ్గాయి.
కమిటీ సిఫార్సులను...
క్వార్టర్ బాటిల్‌పై కనిష్ఠంగా ముప్ఫయి రూపాయలు, గరిష్ఠంగా ఎనభై రూపాయల వరకు తగ్గే అవకాశం ఉంది.అయితే అదే బ్రాండ్లకు సంబంధించిన మద్యం మాత్రం తెలంగాణలో భారీగా పెరగబోతున్నాయన్న వార్తలు మద్యం ప్రియులను కలవరం పెడుతున్నాయి. కనీసం 30శాతం ధరలు పెంచాలన్న మద్యం కంపెనీల డిమాండ్‌లకు అనుగుణంగా కమిటీ సిఫార్సులతో కూడిన ఫైలు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వద్దకు చేరినట్టు తెలిసింది. అయితే ఎంతమేరకు పెంచుతారన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేయాలంటే మద్యం ధరల ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలని భావిస్తును్నట్లు సమాచారం. పెరిగితే మాత్రం తెలంగాణ నుంచి ఏపీకి మందుబాబులు క్యూ కట్టే అవకాశాలున్నాయని చెబుతున్నారు. మరి తెలంగాణ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now