నవంబరు 12న తెలంగాణకు ప్రధాని

ప్రధాని నరేంద్రమోదీ నవంబరు 12వ తేదీన రానున్నారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని మోదీ జాతికి అంకితం చేయనున్నారు.

Update: 2022-10-30 12:44 GMT

ప్రధాని నరేంద్రమోదీ నవంబరు 12వ తేదీన రానున్నారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని మోదీ జాతికి అంకితం చేయనున్నారు. నవంబరు 11న విశాఖపట్నానికి వచ్చి అక్కడి నుంచి ఆయన నేరుగా తెలంగాణకు వస్తారని అదికారిక వర్గాలు వెల్లడించాయి. విశాఖలో రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోదీ రాత్రికి అక్కడే బస చేస్తారు. మరుసటి రోజు విశాఖ నుంచి బయలు దేరి తెలంగాణకు వస్తారు.

ఎరువుల ఫ్యాక్టరీని...
రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వం పునర్ ప్రారంభించింది. ఇందుకు 6,120 కోట్ల రూపాయలను వెచ్చించింది. గత ఏడాది మార్చిలోనే రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ నుంచి ఉత్పత్తి ప్రారంభమయింది. అయినా అధికారికంగా ఫ్యాక్టరీని జాతికి అంకితం చేయనున్నారు. ప్రధాని పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను అధికారులు పరిశీలిస్తున్నారు.


Tags:    

Similar News