Telangana : వెయ్యి కోట్ల ఆస్తిపన్ను వసూళ్లు
తెలంగాణలో ఆస్తిపన్ను వెయ్యి కోట్ల రూపాయలు వసూలు అయింది;

తెలంగాణలో ఆస్తిపన్ను వెయ్యి కోట్ల రూపాయలు వసూలు అయింది. వన్ టైమ్ సెటిల్ మెంట్ కు తెలంగాణ ప్రభుత్వం అవకాశమివ్వడంతో పెద్దయెత్తున స్పందన లభించింది. వన్ టైమ్ సెటిల్ మెంట్ ను అమలు చేసింది. వడ్డీల్లో 90 శాతం రాయితీని ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వీటిని అమలు చేసింది.
మార్చి 31 వ తేదీన...
అయితే ప్రజలు పెద్దయెత్తున స్పందన రావడంతో వెయ్యి కోట్ల రూపాయలు వసులయిందని మున్సిపల్ శాఖ అధికారులు తెలిపారు. మార్చి 31వ తేదీ నాటికి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అన్నీ కలిపి 1,010 కోట్ల రూపాయలు వసూలయినట్లు అధికారులు తెలిపారు. రేపు, ఎల్లుండి సెలవులు అయినా చెల్లించే అవకాశముందని అధికారులు తెలిపారు.