తెలంగాణకు రెయిన్ అలర్ట్

దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. శనివారం ఉదయం నుంచి వర్షాలు కురుస్తున్నాయి.

Update: 2023-07-09 01:53 GMT

తెలంగాణలో నేడు, రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ భారత ప్రాంతాల నుంచి రాష్ట్రంలోకి తక్కువ ఎత్తులో గాలులు వీస్తుండడంతో ఆదివారం తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. శనివారం హైదరాబాద్ సహా తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. 13వ తేదీ వరకు రాష్ట్రంలో విస్తరంగా వానలు కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. 12,13వ తేదీలలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. నైరుతి రుతుపవనాలు తెలంగాణవ్యాప్తంగా విస్తరించడంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. గత నెల కంటే ఈ నెలలో వర్షపాతం ఎక్కువగా నమోదవుతుందని తెలిపారు. హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతమై ఉండనుండగా.. సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో చిరు జల్లులు పడతాయని వాతావరణశాఖ తెలిపింది. గరిష్ట ఉష్ణోగ్రతలు 32 డిగ్రీలలోపు నమోదయ్యే అవకాశముందని అంచనా వేసింది.

దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. శనివారం ఉదయం నుంచి వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కాగా, రోడ్ల మీద భారీగా వదర నీరు చేరడంతో మింట్‌ బ్రిడ్జ్‌ ప్రాంతంలో అండర్‌ పాస్‌ను అధికారులు మూసివేశారు. ఇండియా గేట్‌, నోయిడాలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ప్రజలను ఇబ్బంది పెట్టింది. జమ్మూ, హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, హర్యానా, పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.


Tags:    

Similar News