ఐదు రోజులపాటు వర్షాలే
వచ్చే ఐదు రోజులపాటు తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు
వచ్చే ఐదు రోజులపాటు తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కర్ణాటక పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం గురువారం ఉత్తర కోస్తా కర్ణాటక , దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 4.5 కి.మీ ఎత్తులో కొనసాగుతోంది. తమిళనాడు కోస్తా వద్ద నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం అదే ప్రాంతంలో సగటు సముద్రమట్టానికి 5.8 కి.మీ ఎత్తులో కొనసాగుతోంది.వీటి ప్రభావాలతో తెలంగాణ రాష్ట్రంలో రాగల ఐదు రోజులపాటు తేలిక పాటి నుంచి.. ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం తెలిపింది. రాగల మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కొన్ని జిల్లాల్లో కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది.
గురువారం నాడు హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. బషీర్ బాగ్, ఎంజే మార్కెట్, ట్యాంక్ బండ్ దగ్గర వర్షం కురిసింది. సరూర్ నగర్ మిని ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో వర్షం కురిసింది. ముషీరాబాద్, చిక్కడపల్లి, దోమలగూడ, కవాడిగూడ, భోలక్ పూర్, గాంధీనగర్, రాంనగర్, అడిక్ మెట్, అడ్డగుట్ట, మారేడ్ పల్లి, సీతాఫల్ మండి, బోయిన్‌పల్లి, ప్రకాష్ నగర్, రాణిగంజ్, ప్యారడైజ్ సహా పలు చోట్ల వర్షం కురిసింది.