తెలంగాణకు వర్ష సూచన

తెలంగాణ రాష్ట్రంలో వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ

Update: 2024-02-26 06:44 GMT

తెలంగాణ రాష్ట్రంలో వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జంటనగరాల్లో సోమవారం నాడు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, వికారాబాద్, కామారెడ్డిలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు.

హైదరాబాద్‌లో ఈరోజు ఆకాశం మేఘావృతమై ఉంది. సాయంత్రం ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు చెబుతున్నారు. దక్షిణ తెలంగాణ నుంచి దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. అందువలన ఇది మరాఠ్వాడా నుండి దక్షిణ తమిళనాడు వరకు కర్ణాటక అంతర్భాగంలో సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో విస్తరించి ఉంది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఏపీకి కూడా వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఉత్తర కోస్తా, యానాం ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దక్షిణ కోస్తాంధ్రలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News