Telangana : అమ్మ, కుమార్తె.. ఒకేసారి ప్రభుత్వోద్యాగాలు.. మన తెలంగాణలోనే
తెలంగాణలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. తల్లీ కూతుళ్లకు ఒకేసారి ప్రభుత్వోద్యాగాలు వచ్చాయి
తెలంగాణలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. తల్లీ కూతుళ్లకు ఒకేసారి ప్రభుత్వోద్యాగాలు వచ్చాయి. సింగరేణి కాలరీస్ లో చిరుద్యోగిగా పనిచేస్తున్న రమేష్ కుటుంబంలో ఒకే సారి రెండు ప్రభుత్వాలు ఉద్యోగాలు రావడం ఆ కుటుంబంలో ముందే దీపావళి వచ్చినట్లయింది. తల్లికి లెక్చరర్ ఉద్యోగం, కూతురికి చైల్డ్ డెవలెప్‌మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉద్యాగానికి ఎంపికయ్యారు. రమేష్ భార్య పద్మ తనకు పెళ్లయిన తర్వాత చదువు ఆపేశారు. భర్త రమేష్ ప్రోత్సాహంతో తిరిగి చదువు మొదలుపెట్టారు. కుమార్తె అలేఖ్య ఇద్దరూ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యారు. ఇద్దరూ విజయవంతంగా ప్రభుత్వ ఉద్యోగాలను సాధించారు. పద్మ, అలేఖ్య శ్రమించడం వల్లనే ఈ విజయం దక్కిందని రమేష్ చెబుతున్నారు.
కష్టపడి చదివి...
అదే సమయంలో తన భర్త రమేష్ ప్రోత్సాహంతోనే తాను పన్నెండేళ్ల తర్వాత చదువుకోగలిగానని భార్య పద్మ చెప్పారు. డిగ్రీ పాసైన పద్మ అటు పైన పోస్టు గ్రాడ్యుయేషన్, బీఈడి, ఎంఈడీ, నెట్ అర్హతలు సాధించి అంతిమంగా టీఎస్‌పీఎస్‌సీ ద్వారా గురుకుల కళాశాలలో పీజీటీగా ఎంపికైంది. ఇపుడు సిరిసిల్ల జిల్లా చిన బోనాలలోని రెసిడెన్షియల్ కాలేజ్‌లో పీజీటీగా విధులు నిర్వహిస్తుంది. .అమ్మతో పోటీ పడి కూతురు అలేఖ్య తనేమీ తక్కువ కాదన్నట్లుగా టీఎస్‌పీఎస్సీ ద్వారా రాష్ట్ర స్థాయి మొదటి ర్యాంకు పొందింది. ఇప్పుడు శిశు సంక్షేమ శాఖలో రాజన్న సిరిసిల్ల జిల్లా సీడీపీవోగా పనిచేస్తున్నారు. ఒకే ఇంట్లో తల్లీ కూతుళ్లకు రెండు ప్రభుత్వ ఉద్యోగాలు రావడం అంటే వారు పడిన శ్రమను అభినందించకుండా ఉండలేం.