SLBC Accident : 37వ రోజుకు చేరినా మృతదేహాలు లభ్యం కాకపోవడంతో?

శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ లో జరిగిన ప్రమాదంలో సహాయక చర్యలు 37వ రోజుకు చేరుకున్నాయి;

Update: 2025-03-30 03:39 GMT
rescue operations, accident, left canal tunnel,  srisailam
  • whatsapp icon

శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ లో జరిగిన ప్రమాదంలో సహాయక చర్యలు 37వ రోజుకు చేరుకున్నాయి. టన్నెల్ లో చిక్కుకున్న వారి కోసం ఇంకా అన్వేషణ కొనసాగుతుంది. ఆరుగురి మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. కేరళ కు చెందిన క్యాడవర్ డాగ్స్ సహకారంతో మృతదేహాలు ఉన్న ప్రదేశాన్ని గుర్తించిన సహాయక బృందాలు అక్కడ తవ్వకాలు జరిపే పనిలో ఉన్నాయి. ఇప్పటివరకూ గురుప్రీత్ సింగ్, మనోజ్ కుమార్ మృతదేహాలు మాత్రమే లభ్యమయ్యాయి. మిగిలిన ఆరు మృతదేహాలను వీలయినంత త్వరగా బయటకు తీయాలన్న ప్రయత్నం జరుగుతుంది.

పన్నెండు బృందాలు నిరంతరం...
నాగర్ కర్నూలు జిల్లాలోని దోమలపెంటలో మకాం వేసిన ఎస్.డి.ఆర్.ఎఫ్, ఎన్.డి.ఆర్.ఎఫ్. సింగరేణి, ఆర్మీ వంటి వారితో ఈ సహాయక చర్యలు నిరంతరం కొనసాగుతున్నాయి. ప్రభుత్వం ప్రత్యేక అధికారిగా నియమించిన శివశంకర్ ఎప్పటికప్పుడు వారికి సూచనలు అందిస్తూ తవ్వకాలు జరిపేందుకు అవసరమైన సలహాలు, సూచనలు అందచేస్తున్నారు.ఉదయం సొరంగంలోకి వెళ్లి మధ్యాహ్నానికి తిరిగి వచ్చిన కొన్ని బృందాలతో చర్చించి మధ్యాహ్నం నుంచి మరొక బృందం సొరంగంలోకి బయలుదేరి వెళుతుంది. ఎక్కడ ఏం పనులు చేయాలన్న దానిపై ఒక రూట్ మ్యాప్ ను తయారు చేసుకుని ముందుకు వెళుతుంది.
అనేక ఆటంకాలు...
నీటి ఊట తగ్గక పోవడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతుంది. మరోవైపు బురదతో పాటు టీబీఎం మిషన్ శిధిలాలు కూడా అడ్డు వస్తున్నాయని సహాయక బృందాలు చెబుతున్నాయి. శునకాలు గుర్తించిన ప్రదేశంలో బారికేడ్లను ఏర్పాటు చేసి అత్యాధుని సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన మిషన్లతో తవ్వకాలు జరుపుతున్నాయి. అయినా ఇప్పటి వరకూ మరో మృతదేహం జాడ దొరకలేదు. సెలవు దినం అనేది లేకుండా శ్రమిస్తున్నా మృతదేహాల జాడ లభించకపోవడంతో అందరిలోనూ నైరాశ్యం అలుముకుంది. అయితే నేడు, రేపట్లో మృతదేహాల జాడ లభించే అవకాశముందని వారు చెబుతూ సహాయక చర్యలు మాత్రం కొనసాగిస్తూనే ఉన్నారు.


Tags:    

Similar News