తెలంగాణ ఇన్‌ఛార్జి గవర్నర్ నియామకం జరిగేనా?
తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ రాజీనామాతో కొత్త గవర్నర్ నియామకం ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.;
తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ రాజీనామాతో కొత్త గవర్నర్ నియామకం ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున కొత్త గవర్నర్ నియామకం ఆలస్యమవుతుంది. అందుకే ఇన్‌ఛార్జి గవర్నర్ ను నియమించనున్నారని తెలిసింది. తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను ఇన్‌ఛార్జి గవర్నర్ గా నియమించే అవకాశాలున్నాయని చెబుతున్నారు.
పుదుచ్చేరికి...
అదే సమయంలో పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్ గవర్నర్ బాధ్యతలను తమిళనాడు గవర్నర్ రవికి ఇచ్చే అవకాశముంది. తాత్కాలికంగా ఇద్దరినీ ఈ పదవుల్లో నియమించవచ్చని తెలుస్తోంది. ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో ప్రక్రియ పూర్తయ్యేంత వరకూ రాష్ట్రపతి తాత్కాలికంగా పొరుగు రాష్ట్రాల గవర్నర్లకు బాధ్యతలను అప్పగించే అవకాశముందని తెలిసింది.