Revanth Reddy : కార్యాలయాల్లో కాదు.. క్షేత్ర స్థాయిలో పర్యటించండి

క్షేత్ర స్థాయిలో ప్రజల సమస్యలు ఏంటో తెలుసుకుని సత్వరమే వాటికి పరిష్కారం చూపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు

Update: 2024-07-16 06:32 GMT

క్షేత్ర స్థాయిలో ప్రజల సమస్యలు ఏంటో తెలుసుకుని సత్వరమే వాటికి పరిష్కారం చూపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో ఆయన ప్రారంభోపన్యాసం చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజల ఆలోచనలను పసిగట్టి మసులుకోవాలని కోరారు. లబ్దిదారులను గుర్తించడంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజల ఆలోచనల ప్రకారమే జిల్లాల్లో పాలన ఉండేలా చూసుకోవాలని కోరారు. ఐఏఎస్, ఐపీఎస్ లు క్షేత్ర స్థాయి పర్యటనలు చేస్తేనే విషయాలు సత్వరం అర్థమవుతాయని తెలిపారు.

లబ్దిదారులను...
కార్యాలయాలకే పరిమితం కాకుండా క్షేత్ర స్థాయి పర్యటనలకు వెళ్లాలని సూచించారు. ప్రజా పాలన దరఖాస్తులను స్వీకరించి లబ్దిదారులను గుర్తించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. మానవీయ కోణంలో ప్రజలకు ప్రయోజనం చేకూర్చేలా నిర్ణయాలు ఉండేలా చూడాలని రేవంత్ రెడ్డి కోరారు. జిల్లాల్లో అధికారుల పనితీరుపైనే పాలన ఆధారపడి ఉంటుందని ఆయన గుర్తు చేశారు. అధికారులు వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చినా తెలంగాణను సొంత రాష్ట్రంగా భావించి పనిచేయాలని సూచించారు.


Tags:    

Similar News