తెరుచుకున్న పాఠశాలలు
తెలంగాణలో వేసవి సెలవుల అనంతరం నేటి నుంచి పాఠశాలలు ప్రారంభమయ్యాయి. రెండేళ్ల తర్వాత జూన్ లో పాఠశాలలు ప్రారంభం అయ్యాయి
తెలంగాణలో వేసవి సెలవుల అనంతరం నేటి నుంచి పాఠశాలలు ప్రారంభమయ్యాయి. రెండేళ్ల తర్వాత జూన్ లో పాఠశాలలు ప్రారంభం అయ్యాయి. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ పాఠశాలల్లో ఉపాధ్యాయులు వ్యవహరించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ, ప్రయివేటు, గురుకుల పాఠశాలలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. కరోనా వ్యాప్తి పెరుగుతున్నందున కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ పాఠశాలలు తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇంగ్లీష్ మీడియంలో...
ఈ ఏడాది కొత్తగా ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశ పెడుతున్నారు. విద్యార్థులు కోరుకున్న మీడియంలోనే చదివే విధంగా సిలబస్ ను రూపొందించారు. ఒక నెల రోజుల పాటు ఇంగ్లీష్ మీడియంలో బ్రిడ్జి కోర్సులు నిర్వహించనున్నారు. ఇప్పటికే విద్యార్థులకు కావాల్సిన పుస్తకాల పంపిణీ పూర్తయింది. బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించింది. కొత్తగా ప్రభుత్వ పాఠశాలల్లో 70 వేల మంది విద్యార్థులు చేరారని విద్యాశాఖ తెలిపింది.