సంతోష్ రెడ్డి ముగిసిన సోదాలు.. రూ 4కోట్లు స్వాధీనం

సంతోష్ రెడ్డి ఇంట్లో ఆదాయపు పన్ను శాఖ అధికారుల సోదాలు ముగిశాయి. నాలుగు కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు.

Update: 2022-11-23 12:04 GMT

సంతోష్ రెడ్డి ఇంట్లో ఆదాయపు పన్ను శాఖ అధికారుల సోదాలు ముగిశాయి. నిన్నటి నుంచి కొంపల్లిలోని సంతోష్ రెడ్డి ఇంట్లో ఐటీ శాఖ అధికారులు తనిఖీ చేస్తూనే ఉన్నారు. కొద్దిసేపటి క్రితం సోదాలు ముగియడంతో సంతోష్ రెడ్డి ఇంటి నుంచి అధికారులు వెళ్లిపోయారు.

కీలక డ్యాక్యుమెంట్లు....
అయితే సంతోష్ రెడ్డి ఇంటి నుంచి నాలుగు కోట్ల రూపాయల నగదును ఆదాయపు పన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పలు కీలక పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్నారు. మల్లారెడ్డి విద్యాసంస్థలకు చెందిన పలు కీలక డాక్యుమెంట్లు ఇక్కడ లభ్యమయినట్లు చెబుతున్నారు.


Tags:    

Similar News