Breaking : కల్వకుంట్ల కవితకు మరోసారి షాక్

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంటల కవిత బెయిల్ పిటీషన్‌పై సుప్రీంకోర్టు విచారణను వాయిదా వేసింది. ఈ నెల 20వ తేదీకి విచారణను వాయిదా వేసింది.

Update: 2024-08-12 07:12 GMT

kalvakuntla kavitha, mlc, bail, condition

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంటల కవిత బెయిల్ పిటీషన్‌పై సుప్రీంకోర్టు విచారణను వాయిదా వేసింది. ఈ నెల 20వ తేదీకి విచారణను వాయిదా వేసింది. అయితే సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. మధ్యంతర బెయిల్ ను సుప్రీంకోర్టు నిరాకరించింది. ఢిల్లీ మద్యం కేసులో ఈడీ, సీబీఐ దాఖలు చేసిన కేసుల్లో తనకు బెయిల్ ఇవ్వాలంటూ కల్వకుంట్ల కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

విచారణను...
ఈరోజు సుప్రీంకోర్టులోకవిత పిటీషన్ పై జస్టిస్ విశ్వనాధ్, జస్టిస్ బీఆర్ గవాయి ధర్మాసనం విచారించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈ ఏడాది మార్చి 15 వతేదీన హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ లో ఉన్న కల్వకుంట్ల కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఆమెను కోర్టు అనుమతితో విచారణ చేసిన తర్వాత తీహార్ జైలుకు తరలించారు.


Tags:    

Similar News