KCR : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు దూరంగానే కేసీఆర్

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయిబీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ సమావేశాలకు దూరంగా ఉండే అవకాశముంది.

Update: 2024-12-09 04:03 GMT

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే ప్రతిపక్ష నేత, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ సమావేశాలకు దూరంగా ఉండే అవకాశముంది. నిన్న ఎర్రవెల్లి ఫాం హౌస్ లో బీఆర్ఎస్ శాసనసభ పక్ష సమావేశాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు శాసనసభ, శాసనమండలిలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం పై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. అంతే తప్పించి ఆయన తాను అసెంబ్లీ సమావేశాలకు వస్తానని చెప్పకపోవడంతో ఆయన రాకపై అనుమానాలు కలుగుతున్నాయి.

https://www.instagram.com/s/aGlnaGxpZ2h0OjE3OTY2NjI1MTQwODE4MzU2?igsh=dTFicjVjejh5ZW0y 

స్పష్టత లేకపోవడంతో...
తాను అసెంబ్లీకి వచ్చేది రానిది స్పష్టత చేయకపోవడంతో ఈ సమావేశాలకు కేసీఆర్ దూరంగా ఉండే అవకాశాలున్నాయని గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే కేసీఆర్ శాసనసభకు రావాలంటూ పిలుపు నిస్తున్నారు. అయితే కేసీఆర్ ఈ సమావేశాలకు కూడా దూరంగానే ఉండే అవకాశాలున్నాయి. ఆయన అసెంబ్లీకి రాదలచుకుంటే వస్తారని, లేదంటే లేదని ఎమ్మెల్యేలు చెబుతున్నారు. సంక్రాంతి తర్వాత జనంలోకి వెళ్లేందుకు కేసీఆర్ ప్లాన్ చేసుకుంటున్నారని చెబుతున్నారు. బడ్జెట్ సమావేశాలకు ఒక రోజు హాజరైన కేసీఆర్ తర్వాత ఎప్పుడు సమావేశాలు జరిగినా దూరంగానే ఉంటున్నారు.


Tags:    

Similar News