Telangana : నేడు హైకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటీషన్?
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు హైకోర్టును ఆశ్రయించే అవకాశాలున్నాయి.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు హైకోర్టును ఆశ్రయించే అవకాశాలున్నాయి. ఆయన తనపై నమోదయిన కేసులపై క్వాష్ పిటీషన్ వేయనున్నారు. నిన్న అవినీతి నిరోధక శాఖ అధికారులు మాజీ మంత్రి కేటీఆర్ పై ఫార్ములా ఈ కారు రేసులో అవినీతి జరిగిందని కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఆయన ఈ క్వాష్ పిటీషన్ వేయనున్నారు.
నాన్ బెయిల్ బుల్ కేసులు....
కేటీఆర్ పై నాన్ బెయిల్ కేసులు నమోదు చేయడంతో తనపై నమోదయిన కేసులను క్వాష్ చేయాలని ఆయన హైకోర్టులో పిటీషన్ దాఖలు చేయనున్నట్లు తెలిసింది. ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో క్వాష్ పిటీషన్ వేసేందుకు అవకాశం లభించిందని, ఇప్పటికే కేటీఆర్ న్యాయనిపుణులతో చర్చించారని చెబుతున్నారు. మరోవైపు నిన్న మీడియా సమావేశంలోనూ తాము న్యాయపరంగా కేసులను ఎదుర్కొంటామని చెప్పారు.