Telangana : నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు...హాట్ హాట్ గా

నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు హాట్ హట్ గా సాగనున్నాయి.

Update: 2024-12-09 01:49 GMT

ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Download The App Nowఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Download The App Nowనేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు హాట్ హట్ గా సాగనున్నాయి. సోమవారం నుంచి ప్రారంభమయ్యే ఈ సమావేశాల్లో అనేక అంశాలు చర్చకు రానున్నాయి. కీలక అంశాలు స్వల్పకాలిక, దీర్ఘకాలిక చర్చలుగా సాగనున్నాయి. ఇందుకు అధికార, విపక్ష పార్టీలు సిద్ధమయ్యాయి. తొలి రోజు అసెంబ్లీ సమావేశాల్లో ఐదు బిల్లులు, రెండు నివేదికను ప్రవేశ పెట్టనున్నారు. తెలంగాణ జీతాలు, పింఛను చెల్లింపు, అనర్హతల తొలగింపు బిల్లు, తెలంగాణ పురపాలక, సంఘాల బిల్లు, హైదరాబాద్ నగరపాలకసంస్థ బిల్లు, తెలంగాణ వస్తు సేవల పన్ను బిల్లు, తెలంగాణ పంచాయతీ రాజ్ సవరణ బిల్లులను ప్రవేశపెట్టనున్నారు.

వివిధ బిల్లులను...
తర్వాత తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుతో పాటు డిసెంబరు 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ప్రకటన చేస్తారు. ఈ అంశంపై చర్చ జరిగే అవకాశముంది. తర్వాత పలు సంతాప తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు. అనంతరం సభ వాయిదా పడే అవకాశముంది. ఈ సమావేశాల్లో రైతులకు రెండు లక్షల రుణమాఫీ, రైతు భరోసా వంటి అంశాలపై చర్చ జరిగే అవకాశముంది. అలాగే లగచర్ల ఘటనపై కూడా చర్చకు విపక్షాలు పట్టుబట్టే అవకాశముంది. హైడ్రా కు అధికారాలు, మూసీ సుందరీకరణ ప్రాజెక్టు వంటి అంశాలపై కూడా ప్రభుత్వం ప్రకటన చేయడంతో పాటు చర్చ జరిగే అవకాశముంది. రైతు బంధు రెండుదఫాలు ఒకేసారి ఇవ్వాలని బీఆర్ఎస్ డిమాండ్ చే్స్తున్న నేపథ్యంలో చర్చ వేడివాడిగా సాగే అవకాశముంది.
ఏడాది పాలనపై...
ఇందుకోసం అధికార, విపక్ష పార్టీల నేతలు పూర్తి స్థాయిలో సన్నద్ధులయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనపై తాము అమలు చేసిన హామీలపై ప్రకటన చేయనున్నారు. అలాగే ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీలు కాంగ్రెస్ ఏడాది పాలనపై ఛార్జిషీట్ విడుదల చేసిన నేపథ్యంలో ఈ సమావేశాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు చోటు చేసుకునే ఛాన్స్ ఉంది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎవరూ ఎలాంటి ర్యాలీలు, ప్రదర్శనలు చేయకూడదని పోలీసులు ఆంక్షలు విధించారు. అసెంబ్లీ వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఎవరూ అసెంబ్లీ వైపునకు రాకుండా పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు.


ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Download The App Now

Tags:    

Similar News