Telangana : స్కిల్ యూనివర్సిటీ బిల్లు సభ ముందుకు

తెలంగాణ అసెంబ్లీ కొనసాగుతుంది. సభ లో మంత్రి శ్రీధర్ బాబు స్కిల్ యూనివర్సిటీ బిల్లును సభ ముందు ప్రవేశపెట్టా

Update: 2024-07-30 05:31 GMT

తెలంగాణ అసెంబ్లీ ఈరోజు కూడా కొనసాగుతుంది. సభ ప్రారంభయిన వెంటనే మంత్రి శ్రీధర్ బాబు స్కిల్ యూనివర్సిటీ బిల్లును సభ ముందు ప్రవేశపెట్టారు. దీంతో పాటు మరో పందొమ్మిది పద్దులపై శాసనసభలో చర్చ కొనసాగుతుంది. వ్యవసాయం, సహకార, నీటిపారుదల, ఆర్‌అండ్‌బి పద్దులపై చర్చ జరుగుతుంది. పంచాయతీరాజ్, రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, గృహనిర్మాణం పద్దులపై కూడా చర్చ జరగనుంది. దీంతో పాటు పౌర సరఫరాల శాఖ, పశుసంవర్థక, పర్యాటక, క్రీడాశాఖల పద్దులపై చర్చ జరగనుంది.

సబ్జెక్ట్ కే పరిమితమవ్వాలంటూ...
అలాగే అటవీ శాఖ, దేవాదాయ, మైనారిటీ, చేనేత, స్త్రీ శిశు సంక్షేమ శాఖ పద్దులపై చర్చ జరగనుంది. అయితే నిన్న ఉదయం పది గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభమై తెల్లవారు జామును 3.15 గంటల వరకూ జరగడంతో స్పీకర్ గడ్డం ప్రసాద్ సభ్యులందరూ సబ్జెక్ట్‌పైనే మాట్లాడాలని కోరారు. సుదీర్ఘ ప్రసంగాలు చేయవద్దంటూ సభ్యులను స్పీకర్ కోరారు. కేవలం సబ్జెక్ట్ కే పరిమితం కావాలని, డీవియేట్ కావద్దని సూచించారు. సభ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.


Tags:    

Similar News