నిలకడగానే ఆరోగ్యం.. అంతా నార్మల్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు యాంజియో గ్రామ్ పరీక్షలు నిర్వహించారు. అయితే ఈ టెస్ట్ లో నార్మల్ గా ఉందని తేలింది.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు యాంజియో గ్రామ్ టెస్ట్ పరీక్షలు నిర్వహించారు. అయితే ఈ టెస్ట్ లో నార్మల్ గా ఉందని తేలింది. ఎటువంటి బ్లాక్స్ లేవని యశోదా ఆసుపత్రి వైద్యులు చెప్పారు. ఎడమ చేయి లాగుతుండటంతో ఆయన ముందస్తుగా పరీక్షల కోసం యశోదా ఆసుపత్రికి వచ్చారు. రెగ్యులర్ చెకప్ లో భాగంగానే ఈ టెస్ట్ లు చేస్తున్నామని తెలిపారు.
యాంజియో గ్రామ్ టెస్ట్....
యశోదా ఆసుపత్రి కి కేసీఆర్ వచ్చిన వెంటనే యాంజియో గ్రామ్ టెస్ట్ చేశారు. ఆయనకు ఆరోగ్య పరంగా ఎలాంటి ఇబ్బంది లేదని యశోదా వైద్యులు చెప్పారు. కాసేపట్లో ఆయన తిరిగి ప్రగతి భవన్ కు చేరుకుంటారని వైద్యులు చెప్పారు. కాగా యశోద ఆసుపత్రి వద్ద వీఐపీల రాక పెరగడంతో ట్రాఫిక్ రద్దీ పెరిగింది. దీంతో పోలీసులు అక్కడ భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.