నేరుగా రైతు వద్దకు వెళ్లిన కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గద్వాల్ లో పర్యటించారు. తిరుగు పర్యటనలో జాతీయ రహదారిపైరైతుతో ముచ్చటించారు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గద్వాల్ లో పర్యటించారు. ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన కేసీఆర్ తిరుగు పర్యటనలో జాతీయ రహదారిపై ఒక పొలం వద్ద ఆగారు. అక్కడ రైతుతో ముచ్చటించారు. మినుములు, వేరుశెనగ వేస్తున్నట్లు ఆ రైతు కేసీఆర్ కు చెప్పారు. ఎకరాకు ఎంత దిగుబడి వస్తుందో అడిగి కేసీఆర్ తెలుసుకున్నారు. క్వింటాల్ కు వేరుశెనగ, మినుములు ఎంత ధర పలుకుతుందన్నది కూడా అడిగి తెలుసుకున్నారు.
ప్రత్యామ్నాయ పంటలపై...
రైతులు ప్రత్యామ్నాయ పంటలపైనే దృష్టి పెడితే మంచిదని కేసీఆర్ సూచించారు. వరి వల్లనే లాభాలు వస్తాయన్న భ్రమలను తొలగించుకోవాలని సూచించారు. ఆ రైతు కూడా కేసీఆర్ వాదనను సమర్థించారు. ఇప్పుడు నీరు, కరెంటు పుష్కలంగా ఉండటంతో ఏ పంట అయినా ధైర్యంగా వేసుకోవచ్చని అన్నారు. కేసీఆర్ నేరుగా రైతు వద్దకు వెళ్లి ప్రత్యామ్నాయ పంటలు ఎలా ఉన్నాయో పరిశీలించడం చర్చనీయాంశమైంది.