రేపు ఢిల్లీకి కేసీఆర్
రేపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ వెళుతున్నారు. ఇటీవల జాతీయ రాజకీయాలపై కేసీఆర్ దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే.
రేపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ వెళుతున్నారు. ఇటీవల జాతీయ రాజకీయాలపై కేసీఆర్ దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. కొద్దిరోజుల క్రితం ముంబయికి వెళ్లి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ను కలిసి జాతీయ రాజకీయాలపై చర్చించారు. ప్రధానంగా రాష్ట్రపతి అభ్యర్థిపై కేసీఆర్ బీజేపీయేతర పార్టీ నేతలతో కలిసే అవకాశముంది.
రాష్ట్రపతి ఎన్నికలపైనే....
రాష్ట్రపతి ఎన్నికల్లో జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను పోటీ చేయించాలన్న ఉద్దేశ్యంలో ఉన్నారు. ఆయనను అంగీకరించే ప్రయత్నాలు కూడా ఇప్పటికే మొదలయ్యాయి. బీజేపీ, కాంగ్రెస్ లకు ప్రత్యామ్నాయంగా కూటమి ఏర్పాటు చేయాలని భావించినా, తొలుత రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీని దెబ్బతీయాలన్న యోచనలో కేసీఆర్ ఉన్నారు. ఢిల్లీకి రేపు బయలుదేరి వెళ్లి రెండు, మూడు రోజులు అక్కడే ఉండే అవకాశముంది.